బ్లూవేల్‌కు మ‌ధురై విద్యార్థి బ‌లి

Thu,August 31, 2017 09:47 AM

మ‌ధురై: బ్లూవేల్ ఛాలెంజ్‌కు మ‌రో విద్యార్థి బ‌ల‌య్యాడు. త‌మిళ‌నాడులోని మ‌ధురైకి చెందిన విఘ్నేశ్ బ్లూవేల్ గేమ్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. బుధ‌వారం సాయంత్రం 4.15 నిమిషాల‌ను అత‌ను ఉరి వేసుకున్న‌ట్లు గుర్తించారు. విఘ్నేశ్ ఎడ‌మ చేతిపై బ్లూవేల్ బొమ్మ ఉన్న‌ది. దాని కింద బ్లూవేల్ అని అక్ష‌రాల‌తో రాసి ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. విఘ్నేశ్ రాసిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లూవేల్ అతి ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట అని సూసైడ్ నోట్‌లో విఘ్నేశ్‌ రాసిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఇది గేమ్ కాదు, ఇదో డేంజ‌ర్‌. ఇది ఆడితే, దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేం అని అత‌ను నోట్‌లో రాసిన‌ట్లు గుర్తించారు. విఘ్నేశ్ బీకామ్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. అయితే త‌మిళ‌నాడులో బ్లూవేల్ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇదే మొద‌టిది. పోలీసులు ఈ ఆత్మ‌హ‌త్య‌పై మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడుతున్న పిల్ల‌ల ప‌ట్ల శ్ర‌ద్ధ చూపించాల‌ని ఇటీవ‌లే త‌మిళ‌నాడు పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముంబై, కోల్‌క‌తా, యూపీల్లోనూ ఇటీవ‌ల బ్లూవేల్ ఆత్మ‌హ‌త్య‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

1648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles