జ‌మ్మూ బ‌స్టాండ్‌లో పేలుడు.. 28 మందికి గాయాలు

Thu,March 7, 2019 12:33 PM

blast in Jammu bus stand, 8 injured


జ‌మ్మూ : జమ్మూక‌శ్మీర్‌లో ఇవాళ పేలుడు సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. జ‌మ్మూ బ‌స్టాండ్‌లో ఆగి ఉన్న ఓ బ‌స్సులో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 28 మంది పౌరులు గాయ‌ప‌డ్డారు. బ‌స్సులో గ్రేనేడ్ పేలుడు సంభ‌వించిన‌ట్లు అనుమానిస్తున్నారు. అయితే పేలుడు స‌మ‌యంలో బ‌స్సులో ఎవ‌రైనా ప్ర‌యాణికులు ఉన్నారా లేదా అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. గాయ‌ప‌డ్డ‌వారిని హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. బ‌స్టాండ్‌లో జ‌రిగింది గ్రేనేడ్ పేలుడే అని ఐజీ సిన్హా తెలిపారు.

1732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles