మాజీ పోలీసు అధికారి ఆస్తులు 400 కోట్లు!

Sat,June 10, 2017 11:59 AM

Black money hunt leads IT to ex cop assets worth Rs 400cr

కేరళ : కేరళకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి కోట్లకు పడగలెత్తాడు. ఈ అవినీతి తిమింగలం రూ. 400 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఈ పోలీసు అధికారి రాష్ట్రపతి పోలీసు మెడల్ కూడా అందుకున్నాడు. నాగలాండ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వర్తించిన ఎంకేఆర్ పిైళ్లె పదవీవిరమణ పొందాడు. పిైళ్లెకి శ్రీవాలసమ్ గ్రూప్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పిైళ్లెకి సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. విధుల్లో ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను తన సంస్థలోకి మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. కేరళ, కర్ణాటక, నాగలాండ్, ఢిల్లీలో పిైళ్లెకి సంబంధించిన నివాసాలలో తనిఖీలు చేశారు అధికారులు.

1971లో నాగలాండ్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఆరేళ్ల క్రితం అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. ఉత్తమ సేవకు గానూ 2005లో రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకున్నారు. పిైళ్లె సార్‌గా నాగలాండ్‌లో ఆయన అందరికీ సుపరిచితం. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులతో ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బినామీ పేర్లతో పలు సంస్థలు నడుపుతున్నట్లు అధికారుల సోదాల్లో వెలుగు చూశాయి. ప్రస్తుతం పిైళ్లె నాగలాండ్ పోలీసు శాఖలో కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పిైళ్లె అక్రమాస్తులకు సంబంధించి నాగలాండ్ డీజీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పిైళ్లె సెలవుల్లో ఉన్నారని, వచ్చే వారం విధుల్లో చేరుతారని తెలిపారు. అప్పుడు మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.

1378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles