దయ్యాలు వదిలిస్తామని తొక్కారు.. ప్రాణాలు వదిలాడు

Thu,November 15, 2018 04:38 PM

BLACK MAGIC KILLED THE MAN

21వ శతాబ్దంలోనూ మూఢాచారాలకు మననుషుల నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తాజాగా సూరత్‌లో ఓ వ్యక్తిని అతని కుటుంబసభ్యులే దుష్టశక్తుల్ని వదిలిస్తున్నామనుకుని అతడి ఛాతీమీద వంతులేసుకుని మరీ తొక్కారు. కానీ తామే దుష్టశక్తులమని తెలుసుకోలేకపోయారు. తీరా చూస్తే సదరు వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతునిపేరు కంజీ కుంభార్ (50). అతడిని ఏవో శక్తులు ఆవహించాయని అనుకున్నారు.

క్షుద్రపూజ జరిపేందుకు సిద్ధమయ్యారు. వారంతా అతనిచేత కుంకుమ నీళ్లు తాగించారు. ఆపై ఛాతీ మీద ఒకరివెనుక ఒకరు తొక్కడం మొదలుపెట్టారు. అలా చేస్తే దుష్టశక్తులు పోతాయని నమ్మకమట. భార్య హంస (45), కొడుకులు ప్రకాశ్ (20), దినేశ్ (19), కూతురు హేతల్ (23), కోడలు నిశిత (19).. అందరూ కలిసి కుంభార్‌ను ఒకరి వెనుక ఒకరు తొక్కితొక్కి చంపారు. గత ఆదివారం ఈ ఘటన జరిగింది. కుంబార్ చనిపోవడంతో వారంతా ఇల్లు విడిచి పారిపోయారు. తర్వాత భార్య తిరిగివచ్చి తన భర్తం చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానంతో తీగలాగితే డొంకంతా కదిలింది. దాంతో మొత్తం అందరినీ అరెస్టు చేశారు.

2293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles