పిల్లలపై దాడి చేస్తారా.. బీజేపీపై రాహుల్ సీరియస్!

Thu,January 25, 2018 01:03 PM

BJPs use of hatred and violence is setting our entire country on fire says Rahul Gandhi on Twitter

న్యూఢిల్లీః ఓ సినిమాపై ఆగ్రహం వాళ్లను విచక్షణ కోల్పేయేలా చేసింది. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని దుస్థితిలోకి నెట్టేసింది. ఫలితమే అభంశుభం తెలియని పసివాళ్లు వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. పద్మావత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా నిన్న గురుగ్రామ్‌లో ఆందోళనకారులు ఓ స్కూలు బస్సుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మూవీ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ వాళ్లను ఉగ్రవాదులతో పోల్చాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలపై దాడిని సమర్థించేంత పెద్ద కారణం ఎప్పుడూ ఉండబోదని ఆయన ట్విట్టర్‌లో అన్నారు. హింస, ద్వేషం అనేవి బలహీనుల ఆయుధాలను ఆయన విమర్శించారు. బీజేపీ చేస్తున్న ఈ హింస, విద్వేష రాజకీయాలు దేశం మొత్తాన్ని అగ్నిగుండంగా మార్చాయని మండిపడ్డారు.


హర్యానాతోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో పద్మావత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురుగ్రామ్‌లో స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పిల్లలు క్షేమంగా బయటపడినా.. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.స్కూల్ బస్సుపై దాడి.. 18 మంది అరెస్ట్
పద్మావత్ మూవీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగంగా హర్యానాలోని గురుగ్రామ్‌లో స్కూల్ బస్సుపై దాడి చేసిన కేసులో 18 మందిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సుపై రాళ్లు విసిరిన వాళ్లలో ఈ 18 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లను ఓ స్థానిక కోర్టులో హాజరు పరచనున్నారు. స్థానిక జీడీ గోయెంకా స్కూల్‌కు చెందిన పిల్లలను ఈ బస్సు తీసుకెళ్తున్న సమయంలో దాడి జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు స్కూల్ బస్సుపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్‌పుత్ కర్ణిసేన స్పష్టంచేసింది. రాజ్‌పుత్‌లు ఎప్పుడూ స్కూల్ బస్సుపై దాడి అన్న ఆలోచన కూడా చేయరు. తమ శాంతియుత ఆందోళనను బలహీన పరచాలన్న ఉద్దేశంతో కొందరు రాజకీయ నేతలు వేసిన ఎత్తుగడ ఇది అని కర్ణిసేన చెప్పింది. ఎవరు రాళ్లు విసిరారో తెలియదు కాబట్టి.. కర్ణిసేనను బాధ్యుల్ని చేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది.

2391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles