మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం

Wed,April 17, 2019 04:43 PM

BJP writes to Election Commission over alleged biopic of West Bengal CM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. బెంగాల్ టైగర్ భాగిని పేరుతో మమతా బెనర్జీ బయోపిక్ రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మే నెల 3వ తేదీన విడుదల కానుంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం భాగిని చిత్రం మే 3వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. కావునా చిత్రం విడుదలకు ముందే దాన్ని సమీక్షించాల్సిందిగా ఈసీని కోరారు. నరేంద్రమోదీ బయోపిక్ విడుదల అంశంలో సీఈసీ పాటించిన మార్గదర్శకాలనే ఈ చిత్రం విషయంలో కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles