గుజరాత్‌లో ‘ఆరే’సిన బీజేపీ

Mon,December 18, 2017 02:49 PM

BJP wins Gujarat Polls

అహ్మదాబాద్ : గుజరాత్‌లో మరోసారి బీజేపీ విజయాన్ని ముద్దాడింది. వరుసగా ఆరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది బీజేపీ. పూర్తిస్థాయి మెజార్టీని బీజేపీ సాధించింది. అయినప్పటికీ కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. మొదట్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనప్పటికీ.. తర్వాతి గంటల్లో బీజేపీ బలపడింది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఓట్లు అధికంగా వచ్చాయి.

1995 నుంచి వరుసగా అధికారం చేపడుతోంది కమలం పార్టీ. 182 స్థానాలకు గానూ బీజేపీ 92 స్థానాలకు పైగా గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 92. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే బీజేపీ సీట్లు సాధించడంతో.. ఏ పార్టీ పొత్తు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన విషయం విదితమే. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. గుజరాత్‌లో తొలిసారి గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. పాటిదార్ ప్రాంతాలతో పాటు ముస్లిం ఏరియాల్లోనూ బీజేపీ మంచి ఓటు బ్యాంకును సంపాదించింది. నోటాకు 5 లక్షలకు పైనే ఓట్లు పోలయ్యాయి. రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, మెహసానా నుంచి డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గెలుపొందారు. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 61, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందిన విషయం విదితమే.

3399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles