మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీకే అనుకూలం

Mon,October 21, 2019 06:43 PM

న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాల శాసనసభ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ర్టలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తున్నాయి.


ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 288 స్థానాలకు గానూ బీజేపీకి 150 స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే తెలుస్తోంది. శివసేన 100 స్థానాల్లో కాంగ్రెస్‌కు 20 స్థానాలు, ఇతరులు పది స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక హర్యానాలోనూ భారతీయ జనతా పార్టీనే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అక్కడ బీజేపీనే గెలిచే అవకాశం కనిపిస్తోంది. 90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 71, కాంగ్రెస్ 11, ఇతరులు 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మొత్తానికి రెండు రాష్ర్టాల్లో బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.

790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles