కర్ణాటకలో బీజేపీ.. తమిళనాడులో కాంగ్రెస్ హవా!

Sun,May 19, 2019 06:54 PM

bjp will win in karnataka and congress will win in Tamil Nadu

హైదరాబాద్ : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోంది. కాంగ్రెస్ - జేడీఎస్ పొత్తు బెడిసికొట్టినట్టుంది. ఇక్కడ బీజేపీనే అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీ 21 నుంచి 25, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 3-6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

తమిళనాడులో మాత్రం భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం 38 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీ 4 స్థానల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు కలిసి 34 నుంచి 38 స్థానాల్లో గెలవనున్నట్లు వెల్లడైంది. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేదా అనేది మే 23న తేలనుంది.

1739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles