వచ్చే ఎన్నికల్లో 72 సీట్లకు తగ్గకుండా గెలుస్తాం..

Mon,January 14, 2019 07:58 PM

BJP will not win less than 72 out of 80 seats says rajnath

న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 80 స్తానాలకుగాను 72 సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తుందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) 'కూటమి'గా ఏర్పడటాన్ని ఆయన తేలిగ్గా తీసిపారేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూటమి విఫలమైన విషయాన్ని రాజ్ నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి 71 సీట్లు గెలుచుకుని అత్యధిక ఎంపీలను లోక్‌సభకు పంపిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు సీట్లు గెలవగా.., సమాజ్‌వాదీ పార్టీ 5, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. బీఎస్‌పీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.

5013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles