ఒకే రోజు 70 ప్రెస్ కాన్ఫరెన్సులు!

Sun,December 16, 2018 04:57 PM

BJP to hold 70 press conferences to counter Congress in Rafale Deal

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ అంశంలో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టడానికి బీజేపీ పెద్ద ప్లానే వేసింది. సోమవారం దేశవ్యాప్తంగా అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వరుస ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. రాఫెల్ డీల్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ కుట్రను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నట్లు పార్టీ రాజ్యసభ ఎంపీ అనిల్ బలుని చెప్పారు. కోర్టు తీర్పు కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని బయటపెట్టిందని ఆయన అన్నారు. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం ముఖ్యమంత్రులైన యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్, విజయ్ రూపానీ, సర్బానంద సోనోవాల్ సోమవారం ఆయా రాష్ర్టాల్లో మీడియాతో మాట్లాడనున్నారు. అటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, సురేశ్ ప్రభు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌లు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నారు. ఇలా దేశవ్యాప్తంగా సుమారు 70 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.

2370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles