అక్కడ బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి..!

Tue,March 6, 2018 10:53 AM

BJP to get deputy CM post in Nagalandకోహిమా: నాగాలాండ్‌లో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఖరారైంది. బీజేపీ ఎన్నికల ప్రచార ఛైర్మన్ ఎం. చుబా విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి నైపూ రియో ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ అభ్యర్థికి కేటాయించేందుకు జరిగిన చర్చల్లో నార్త్‌ఈస్ట్ డెమోక్రటిక్ అలియన్స్(ఎన్‌ఈడీఏ) కన్వీనర్ హిమాంత బిశ్వా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. సోమవారం బీజేపీ శాసనసభ పార్టీ నాయకుడిగా వై.పాటన్‌ను ఎంపికైన నేపథ్యంలో ఆయననే ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుంది. నూతనంగా గెలుపొందిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం దిమాపూర్‌లో ఆపార్టీ పర్యవేక్షకుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు, హిమాంత బిశ్వా, బీజేపీ జాతీయ సెక్రటరీ అరుణ్ సింగ్, నార్త్‌ఈస్ట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) అజయ్ జమవ్వాల్ తెలిపారు. కొత్తగా ఎంపికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా పాటన్‌ను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు.

1259
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles