బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

Sat,September 8, 2018 06:09 PM

BJP national executive meeting starts in Delhi

ఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, అన్ని రాష్ర్టాల బీజేపీ అధ్యక్షులు, బీజేపీ అగ్రనేతలు, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సమావేశాలకు హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలో విజయమే లక్ష్యంగా నాయకులకు అమిత్ షా, ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ర్టాల్లో విజయం సాధించడంపైనా భేటీలో చర్చలు చేపట్టారు. సమావేశాలకు తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు.

1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS