కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్

Wed,April 24, 2019 11:50 AM

BJP MP Udit Raj joins Congress party in presence of Congress President Rahul Gandhi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ బుధవారం ఉదయం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థానాన్ని పంజాబీ గాయకుడు హన్స్‌రాజ్‌కు బీజేపీ ఇవ్వడంతో ఆయన పార్టీ మారారు. మంగళవారం ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిభ కనబర్చిన ఎంపీల్లో తాను రెండో స్థానంలో ఉన్నానని చెప్పారు. తన అధికారిక ట్విటర్ ఖాతాలో చౌకీదార్ పేరును కూడా ఉదిత్ రాజ్ ఉపసంహరించుకున్నారు. ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

1188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles