17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌

Tue,June 11, 2019 12:47 PM

BJP MP Dr Virendra Kumar to be the Protem Speaker of the 17th Lok Sabha

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ ఎంపీ వీరేంద్ర కుమార్‌ నియామకం అయ్యారు. 17వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలతో వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నెల 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు ప్రొటెం స్పీకర్‌. వీరేంద్ర కుమార్‌ లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గర్హ్‌ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వీరేంద్ర కుమార్‌ దళిత కులానికి చెందిన నాయకుడు. సాగర్‌ జిల్లా ఏబీవీపీ కన్వీనర్‌గా 1977-79 మధ్య కాలంలో పని చేశారు. 2014-19 మధ్య కాలంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 1975లో జేపీ మూవ్‌మెంట్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, చైల్డ్‌ లేబర్‌ అంశంపై పీహెచ్‌డీ చేశారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles