ప్రధానమంత్రి ఆవాస యోజన కింద రాముడికి ఇల్లు

Fri,December 28, 2018 02:36 PM

Bjp  MP demands house for ram under PM awas yojana

బాబ్రీ మసీదును కూల్చిన చోట రాముడికి గుడారం వేసి పూజలు చేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం ఎన్నో ఏర్పాట్లు జరిగినా కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడుతూ వస్తున్నది. ప్రభుత్వమే పూనుకుని ఆర్డినెన్స్ తెచ్చి ఆలయం నిర్మించాలని ఆరెస్సెస్‌తో సహా పలు సంస్థలు పట్టుబట్టుతున్నాయి. రాముడిని నిర్వాసితుల జాబితాలో చేర్చి ఇల్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాముడికి ఇల్లు ఇవ్వాలని అయోధ్య జిల్లా మేజిస్ట్రేటుకు ఆయన లేఖ రాశారు. రాముడికి నీడ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. ప్రస్తుతం అయోధ్యలో రాంలాలా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ టెంటులోనే కాలం గడుపుతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌భర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బాబ్రీని కూల్చిన చోటే రాముడికి ఇల్లు కట్టాలని సూచించారు. 2019 ఎన్నికలకు ముందే వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణం డిమాండ్ మరోసారి ప్రబలంగా ముందుకు వస్తున్నది.

1732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles