గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు

Wed,February 6, 2019 01:45 PM

BJP MLAs disrupts Governors address in Karnataka Assembly

బెంగుళూరు: క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో.. బీజేపీ స‌భ్యులు దాన్ని అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకువెళ్లి.. కాంగ్రెస్-జేడీఎస్ కూట‌మికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. 22 పేజీలు ఉన్న ప్ర‌సంగంలో.. గ‌వ‌ర్న‌ర్ కేవ‌లం రెండు పేజీల‌ను మాత్ర‌మే చ‌దివారు. కూట‌మి ప్ర‌భుత్వానికి కావాల్సినంత మ‌ద్ద‌తు లేద‌ని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే బీజేపీతో స‌న్నిహితంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఇవాళ స‌భ‌కు హాజ‌రుకాలేదు.

2531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles