మహిళ ఉద్యోగినిపై బీజేపీ కార్యకర్త వేధింపులు

Sun,November 19, 2017 02:41 PM

BJP members molest woman toll collector when denied free passage

గుర్గావ్ : హర్యానాలోని ఖేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టోల్ ఫీజు చెల్లించమని అడిగిన మహిళా ఉద్యోగినిపై వారు దుర్భషలాడారు. ఈ ఘటన శనివారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఉదయం ఖేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద విధుల్లో మహిళా ఉద్యోగిని ఉన్నారు. అయితే ఎస్‌యూవీ కారులో ఓ బీజేపీ కార్యకర్త అటునుంచి వెళ్తున్నారు. అయితే టోల్ ఫీజు చెల్లించమని ఉద్యోగిని అడిగింది. దీంతో కోపం తెచ్చుకున్న సదరు బీజేపీ కార్యకర్త.. ఆమెపై లైంగిక దాడి చేసేందుకు యత్నించి వేధింపులకు గురి చేశారు. అక్కడున్న క్యాబిన్స్‌ను పగులగొట్టాడు. బీజేపీ కార్యకర్త హల్‌చల్ చేసిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles