జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నం!

Fri,July 6, 2018 04:01 PM

BJP may form government in Jammukashmir with help of rebel MLAs

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. పీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాతే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రను కూడా మార్చే అవకాశం ఉంది. 87 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో పీడీపీకి 28 మంది, బీజేపీకి 25 ఎమ్మెల్యేల బలం ఉంది.

పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు జూన్ 19న బీజేపీ గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ర్టపతి కోవింద్.. జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలన కొనసాగుతుంది.

1485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles