ఓటేసిన ఎల్‌కే అద్వానీ

Tue,April 23, 2019 01:45 PM

BJP leader LK Advani casts his vote at a polling booth at Shahpur Hindi School

గుజరాత్‌ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని షాహపూర్‌ హిందీ పాఠశాలలో అద్వానీ ఓటేశారు. 2014 ఎన్నికల వరకు గాంధీనగర్‌ నుంచి లోక్‌సభకు అద్వానీ ప్రాతినిధ్యం వహించారు. అద్వానీ ఎంపీగా ఉన్న గాంధీనగర్ స్థానాన్ని ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కేటాయించడం అందరికీ తెలిసిందే. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అద్వానీ చెప్పిన తర్వాతే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. అయితే అద్వానీకి ఈ ఎన్నికల్లో చోటు దక్కకపోవడంపై పలు విమర్శలు వచ్చాయి.

91 ఏళ్ల అద్వానీతోపాటు 75 ఏళ్లు పైబడిన మరికొందరు ముఖ్య నేతలకు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించలేదు. గర్వాల్ ఎంపీ బీసీ ఖండూరి (84), నైనితాల్ ఎంపీ భగత్ సింగ్ కోష్యారీ (76), గుజరాత్ ఎంపీ బిజోయ చక్రవర్తి (79)లకు కూడా టికెట్లు ఇవ్వలేదు. 1990ల్లో తన రథయాత్ర సాయంతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అద్వానీ సొంతం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అన్నది ఆయన ప్రధాన ఎన్నికల ఆయుధంగా మారింది. నాలుగుసార్లు రాజ్యసభకు, ఏడుసార్లు లోక్‌సభకు అద్వానీ ఎన్నికయ్యారు. ఉప ప్రధానితోపాటు హోంమంత్రిలాంటి కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను అద్వానీ నిర్వర్తించారు.1157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles