ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదిన బీజేపీ లీడర్.. వీడియో

Tue,February 6, 2018 12:23 PM

BJP leader Dayashankar Singh thrashing truck driver in janpur

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లోని ఓ పెట్రోల్ పంపు వద్ద ఓ బీజేపీ లీడర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అక్కడ నిలిపి ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను బీజేపీ నేత దయాశంకర్ సింగ్ చితకబాదాడు. అతని ట్రక్కును కూడా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బాధిత డ్రైవర్ మాట్లాడుతూ.. అకారణంగా తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. బీజేపీ నేత రాడ్‌తో కొట్టాడని.. ట్రక్కు అద్దాలు పగులగొట్టాడని తెలిపాడు. తన వద్ద ఉన్న రూ. 62,500ల నగదును అపహరించారని స్పష్టం చేశాడు.1350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS