బీజేపీ నాయకుడి కుమార్తె కిడ్నాప్‌

Fri,February 15, 2019 02:54 PM

BJP Leader Daughter Kidnapped at Gunpoint in West Bengal

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ బీర్భూం జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు సుప్రభాత్‌ బట్యాబ్యాల్‌ కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. నిన్న రాత్రి సుప్రభాత్‌ నివాసానికి చేరుకున్న దుండగులు తుపాకులతో బెదిరించి ఆయన కుమార్తెను అపహరించారు. ఈ సమయంలో సుప్రభాత్‌ ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సుప్రభాత్‌ ఐదు నెలల క్రితమే తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. టీఎంసీలో చేరే కంటే ముందు.. ఆయన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ మెంబర్‌గా పని చేశారు. సుప్రభాత్‌ కుమార్తె కిడ్నాప్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా ఒక అనుమానుతిడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కిడ్నాప్‌కు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles