మెజార్టీ లేకున్నా మూడు రాష్ర్టాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ

Fri,November 8, 2019 05:02 PM

హైదరాబాద్‌: మెజార్టీ సంఖ్యాబలం లేకున్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దేశంలోని మూడు రాష్ర్టాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాజస్థాన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. కర్ణాటక, మణిపూర్‌, గోవాలో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం లేదన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం బీజేపీకి ఎదురుదెబ్బేనన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలు వెల్లడై రెండు వారాలు గడుస్తున్నా బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కష్టపడుతున్నాయన్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో, శివసేన 56 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని దక్కించుకున్నా అధికార పంపిణీలో నెలకొన్న సందిగ్ధతతో ఆ రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతుంది.

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles