త్రిపురలో టైట్ ఫైట్ !

Sat,March 3, 2018 10:41 AM

BJP and CPM in tight race in Tripura elections

అగర్తలా: త్రిపుర ఎవరి సొంతం అవుతుంది? బీజేపీ, సీపీఎం మధ్య అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ నడుస్తోంది. ఓట్ల కౌంటింగ్ క్షణం క్షణం అక్కడ పరిస్థితులను మార్చేస్తున్నది. సీఎం అభ్యర్థులు మానిక్ సర్కార్, బిప్లాబ్ కుమార్ డెబ్ తీవ్ర పోటీ ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వాళ్లు ముందున్నారు. త్రిపురలో మొత్తం 59 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 32, సీపీఎం 25 సీట్లతో దూసుకెళ్లుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏ పార్టీకైనా 31 సీట్లు కావాలి. మెజారిటీ కోసం రెండు పార్టీల మధ్య తెగ ఉత్కంఠ నెలకొన్నది. వాస్తవానికి త్రిపురలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ సీపీఎం దూసుకెళ్లుతున్న తీరు అక్కడ ఫలితాల సరళిని మార్చేస్తున్నది. త్రిపురలో 25 ఏళ్లుగా లెఫ్ట్ ప్రభుత్వం ఉన్నది.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles