పోలవరం ప్రాజెక్టుపై బీజేడీ ఎంపీల అభ్యంతరం

Thu,December 8, 2016 12:46 PM

BJD MPs oppose polavaram project

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై బీజేడీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం వల్ల 2 లక్షల మంది ఆదివాసీలు నిర్వాసితులవుతారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో గ్రామ సభలు నిర్వహించకుండానే పనులు మొదలుపెట్టారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాంనాయక్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలం ఆలయానికి ముప్పు పొంచి ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ వల్ల లక్షలాది మంది ఆదివాసీలు నిరాశ్రయులవుతారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. కానీ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.

2481
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS