ఇంజినీర్ తో గుంజీలు తీయించిన ఎమ్మెల్యే..వీడియో వైరల్

Thu,June 6, 2019 05:49 PM

BJD MLA Engineer To Do Sit-Ups For Poor Road Work


భువనేశ్వర్ : రోడ్డు సరిగా వేయలేదని బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ మెహెర్ పీడబ్ల్యూడీ ఇంజినీర్ ను గుంజీలు తీయించారు. సరోజ్ కుమార్ తన నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఓ ప్రాంతంలో వేసిన రహదారిలో నాణ్యతాప్రమాణాలు లోపించాయని సదరు ఇంజినీర్ ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రోడ్డు సరిగా వేయనందుకు 100 గుంజీలు తీయాలని ఇంజినీర్ ను ఆదేశించారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇంజినీర్ ను హెచ్చరించారు. దీంతో హడలెత్తిపోయిన ఇంజినీర్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ ముందు గుంజీలు తీశాడు. ఈ వీడియో ఇపుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరోజ్ కుమార్ మెహెర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.

3162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles