న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీలు.. ఈసారి లోక్‌స‌భకు పోటీ

Thu,March 28, 2019 01:34 PM

BJD fields 4 Rajya Sabha MPs in Lok Sabha, Assembly elections

హైద‌రాబాద్: బీజూ జ‌న‌తాద‌ళ్‌(బీజేడీ)కి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీలు.. ఈసారి లోక్‌స‌భ‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. ఒడిశా సీఎం, బీజేడీ ప్రెసిడెంట్ న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు ప్ర‌స‌న్న ఆచార్య‌కు ఇప్పుడు బార్‌ఘ‌డ్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేయ‌నున్నారు. కంద‌మాల్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అచ్యుత్ స‌మంత పోటీ చేస్తారు. రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న ఫిల్మ్‌స్టార్ అనుభ‌వ్ మోహంతి ఇప్పుడు కేంద్రపారా లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తారు. బీజేపీ ఎంపీ బైజ‌యంతి పాండాపై ఆయ‌న పోటీ చేయ‌నున్నారు. రాజ్య‌స‌భ‌లో ఎంపీగా ఉన్న ప్ర‌తాప్ కేస‌రీ దేవ్‌.. ఈసారి అవుల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారు.

2432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles