బీజేడీ అభ్యర్థిని అరెస్ట్ చేసిన పోలీసులు

Mon,April 22, 2019 06:06 PM

 BJD candidate arrested for leading attack on EC team in Odisha


పూరీ: ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దాడి ఘటనకు సంబంధించి ఒడిశా పోలీసులు బిజు జనతా దళ్ (బీజేడీ)పార్టీ అభ్యర్థి ప్రదీప్ మహారథిపై కేసు నమోదు చేసి.. ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆదివారం పిపిలీ ప్రాంతంలోని ప్రదీప్ మహారథి ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో..బీజేడీ పార్టీ కార్యకర్తలు ప్రదీప్ మహారథి ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, అధికారులపై దాడికి ప్రయత్నించారు. అధికారులపై దాడి ఘటనలో ప్రదీప్ మహారథి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే బిజు జనతా దళ్ పార్టీ ప్రదీప్ మహారథి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. ప్రదీప్ అరెస్ట్ ను ఖండిస్తూ బీజేడీ ఈసీకి ఓ లేఖ రాసింది. ప్రదీప్ మహారథి పిపిలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

1321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles