కేరళలో దారుణం..పిల్లిని ఉరితీశారు!

Tue,November 12, 2019 04:16 PM


తిరువనంతపురం : కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాల్‌కులంగరకు సమీపంలోని ఓ ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పిల్లికి ఉరివేశారు. వినోద కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఎదుట ఈ దారుణం వెలుగుచూసింది. ఫెడరేషన్ ఫర్ ఇండియన్ ఎనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ పార్వతి మోహన్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పార్వతి మోహన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లబ్‌కు వచ్చి మందు సేవించి, జూదం ఆడే వ్యక్తులు మద్యం మత్తులో సరదా కోసం ఈ పని చేసి ఉంటారని పార్వతి మోహన్ ఆరోపిస్తున్నారు. చనిపోయిన పిల్లి గర్భంతో ఉన్నట్లుగా గుర్తించారు.

4040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles