ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్

Tue,July 16, 2019 06:16 PM

Biswabhusan Harichandan appointed as AP governor

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు కేంద్రం ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్.. ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా సుశ్రీ అనసూయ ఊకేని నియమిస్తూ రాష్ర్టపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వభూషణ్ హరిచందన్ ప్రముఖ న్యాయవాది. ఒడిశా మంత్రిగా పనిచేశారు. బిశ్వభూషణ్ హరిచందన్ 1934 ఆగస్టు 03న జన్మించారు. బీఏ (హానర్స్) ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఈఎస్ఎల్ నరసింహన్ ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

3618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles