బైకు, కారు కొంటున్నారా.. ఇన్సూరెన్స్‌కు భారీగా చెల్లించుకోవాల్సిందే!

Thu,October 11, 2018 02:00 PM

Bikes and Cars to cost more as Insurance premium gets costlier

న్యూఢిల్లీ: కారు, బైకు కొనాలనుకునే వారికి ఇది ఒకరకంగా చేదు వార్తే. కొత్తగా వాహనాలు కొనేవాళ్లు ఇక నుంచి ఇన్సూరెన్స్ కోసం భారీగా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. టూ వీలర్ కొనేవాళ్లు ఆ వెహికల్ ధరలో కనీసం పది శాతం వరకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా చెల్లించక తప్పదు. ఇక కారు కొనాలంటే గతంలో ఉన్న ఇన్సూరెన్స్ ప్రిమియానికి రెట్టింపు చెల్లించాల్సిందే. తాజాగా వచ్చిన రెండు కోర్టు తీర్పులు ఈ ధరల పెరుగుదలకు కారణమైంది. దీర్ఘకాలిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అన్నది ఒక తీర్పు కాగా.. ఇక రెండోది రూ.15 లక్షల విలువ గల వ్యక్తిగత ప్రమాద బీమా కూడా తప్పకుండా తీసుకోవాల్సిందే అన్నది రెండో తీర్పు.

ఆ లెక్కన మీరు టూ వీలర్ కొనాలని అనుకుంటే.. ఐదేళ్ల కాలానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రిమియం చెల్లించాలి. దీనికి తోడు ఏడాదికి వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవాలి. ఈ రెండూ కాకుండా సాధారణంగా బండి కొనే సమయంలో తీసుకునే సమగ్ర ఇన్సూరెన్స్ ఎలాగూ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు రూ.75 వేల‌ విలువైన 150 సీసీ బైకు కొంటే.. ఇన్సూరెన్స్ ప్రిమియమే రూ.7600 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కారు విషయానికి వస్తే మూడేళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా కోసం ఏడాదికి రూ.750 అదనంగా చెల్లించాలి.

ఆ లెక్కన 1000 సీసీ కారు మీరు కొనాలని అనుకుంటే.. గతంలో రూ.10 వేలుగా ఉన్న ఇన్సూరెన్స్ ప్రిమియం.. ఇప్పుడు రూ.20 వేలకు చేరింది. అయితే వ్యక్తిగత ప్రమాద బీమా ప్రిమియం చాలా ఎక్కువన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ఏడాదికి రూ.12 కడితే రూ.2 లక్షల వరకు కవర్ అవుతుంది. అంటే లక్ష కవరేజీకి రూ.6 మాత్రమే చెల్లించాలి. అదే ఈ కొత్త ఇన్సూరెన్స్ పాలసీలో మాత్రం రూ.750గా ఉంది. దీని కింద రూ.15 లక్షల వరకు కవరేజీ ఉన్నా.. లక్షకు రూ.50 చెల్లించాల్సి వస్తున్నది.

2794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles