వరద ప్రవాహంలో ఈ బైకర్ చేసిన సాహసం చూడండి..

Wed,August 29, 2018 03:08 PM

Biker's Narrow Escape After Stunt Across Flowing Waterfall In Uttarakhand

ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 14 నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. యమునా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. అయితే.. రామ్‌నగర్‌లో ఓ బ్రిడ్జి మీది నుంచి వరద ఉప్పొంగుతున్నది. దీంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు కలిగాయి. ఈనేపథ్యంలో ఓ బైకర్ ఆ వరద ప్రవాహంపై చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ బైకర్ ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ వరద నుంచి దాటడానికి ప్రయత్నించాడు. అక్కడున్న వాళ్లు కూడా అతడు బైక్ మీద వరదను దాటబోతుంటే ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేశారట. దీంతో మనోడు రెట్టించిన ఉత్సాహంతో బైక్ గేర్ మార్చి వరద నుంచి బైక్‌ను పోనిచ్చాడు. కొద్ది దూరం బైక్ వెళ్లగానే వరద ప్రవాహానికి తట్టుకోలేక బైక్ అమాంతం వరద నీటిలో పడిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు వరదలో కొట్టుకు పోతున్న అతడిని, బైక్‌ను కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

4147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles