బైక్‌ను వేగంగా ఢీకొట్టిన కారు.. ఎగిరి కింద పడ్డ బైకర్.. వీడియో

Thu,February 21, 2019 07:12 PM

Biker Hit By Car and flung away on road In Coimbatore Tamil Nadu

చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. వాహనదారులు చేసే చిన్న తప్పిదాల వల్ల ఎన్నో ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలను మనం చూస్తున్నా... ప్రమాదాలను మాత్రం ఆపలేకపోతున్నాం. తాజాగా... తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కొంత దూరం వరకు ఎగిరి కింద పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు మాత్రం ఆగకుండా అలాగే స్పీడ్‌గా వెళ్లిపోయింది.7319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles