మాజీ ఎమ్మెల్సీ త‌న‌యుడికి జీవిత ఖైదు

Wed,September 6, 2017 04:07 PM

Bihar politicians son Rocky Yadav gets Life Imprisonment in Teen Murder Case

పాట్నా: హ‌త్య కేసులో బీహార్‌కు చెందిన జేడీయూ బ‌హిష్కృత‌ ఎమ్మెల్సీ మ‌నోర‌మాదేవి కొడుకు రాకీ యాద‌వ్‌కు జీవిత ఖైదు విధించింది గ‌యా జిల్లా కోర్టు. అత‌నితోపాటు మ‌రో ఇద్ద‌రికి కూడా జీవిత‌కాల శిక్ష విధించింది. ఈ కేసులో మ‌రో నిందితుడు, రాకీ యాద‌వ్ తండ్రి బిందీ యాద‌వ్‌కు ఐదేళ్ల శిక్ష ఖ‌రారు చేసింది. గ‌తేడాది తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న కారణంతో ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని రాకీ యాద‌వ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. లాండ్ రోవ‌ర్ కారులో వెళ్తున్న రాకీ యాద‌వ్‌ను 19 ఏళ్ల ఆదిత్య త‌న చిన్న కారులో ఓవ‌ర్ టేక్ చేశాడు. ఆ స‌మ‌యంలో అత‌ని కారులో మరో న‌లుగురు స్నేహితులు కూడా ఉన్నారు. దీంతో రాకీ మొద‌ట గాల్లోకి ఓ రౌండ్ కాల్పులు జ‌రిపాడు. ఆదిత్య వెంట‌నే త‌న కారును ఆపాడు. ఆ వెంట‌నే రాకీ మ‌రో రౌండ్ కాల్పులు జ‌ర‌ప‌డంతో అది నేరుగా ఆదిత్య‌కు త‌గిలి అత‌ను అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో రాకీ త‌ల్లి మ‌నోర‌మా దేవి జేడీయూలో ఎమ్మెల్సీగా ఉంది. అయితే ఆ వెంట‌నే ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన రాకీ యాద‌వ్ తండ్రి బిందీ యాద‌వ్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చి ఐదేళ్ల శిక్ష విధించింది.

1630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles