బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్‌తో సహా 18 మంది అత్యాచారం

Sat,July 7, 2018 08:39 AM

బీహార్: బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో దారణ సంఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఆమె చదువుతున్న ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా 18 మంది అత్యాచారం చేశారు. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న ఈ దారుణాన్ని భరించలేక బాలిక తల్లి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కిషోర్ రాయ్ తెలిపారు. నిందితులైన పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ అలియాస్ ముకుంద్ సింగ్, పాఠశాల ఉపాధ్యాయుడు బాలాజీ, మరో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మిగితా నిందితులను గాలించడం కోసం డీఎస్‌పీ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... 2017 డిసెంబర్‌లో ముగ్గురు ఆమెతో చదువుతున్న విద్యార్థులు బాలికపై పాఠశాల మరుగుదొడ్డిలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసిన నిందితులు తోటి విద్యార్థులకు వైరల్ చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని బాలికను బెదిరిస్తూ పలువురు విద్యార్థులు అత్యాచారం చేశారు. ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్‌కు, ఉపాధ్యాయులకు తెలిసింది. వారు కూడా బాధితురాలిని బ్లాక్‌మేయిల్ చేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన ఆమె తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. అత్యాచారం జరిగిన సంగతి తెలిస్తే తనను పాఠశాల మాన్పిస్తారనే భయంతోనే చెప్పలేదని బాధితురాలు పేర్కొంది. బాధితురాలు తెలిపిన 18 మందిపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

7076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles