బిగ్‌బజార్‌ బంపర్‌ ఆఫర్‌.. 23 నుంచి అతిపెద్ద షాపింగ్ ఫెస్టివెల్‌

Mon,January 21, 2019 07:35 AM

Big Bazaars Sabse Saste 5 Din from Jan 23 to 27

హైదరాబాద్: కిశోర్ బియానీకి చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్‌బజార్..'సబ్‌స్‌సస్తా 5 దిన్' పేరుతో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివెల్‌కు సిద్ధమైంది. ఈ నెల 23న ప్రారంభమవనున్న ఈ షాపింగ్ పండుగ 27న ముగియనున్నదని తెలిపింది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.3 వేల కంటే అధిక విలువైన ఆహార, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులు, పాదరక్షలు, బొమ్మలు, లగేజ్‌లతోపాటు ఇతర వస్తువుల కొనుగోలు చేసిన వారికి 20 శాతం కంటే అధికంగా క్యాష్‌బ్యాక్ లభించనున్నట్లు ప్రకటించింది.

దీంతోపాటు రూపే కార్డు కలిగిన కొనుగోలుదారులకు అదనపు రాయితీ లభించనున్నది. కనీసంగా రూ.500 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 21నుంచి 22 లోపు రూ.1,000 షాపింగ్ చేసిన ప్రత్యేక సభ్యులకు రూ.100 అదనపు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు.

దుస్తులపై 50 శాతం రాయితీతోపాటు అదనంగా 20 శాతం క్యాష్‌బ్యాక్, రూ.22,990 ధర కలిగిన కోర్యో 32 అంగుళాల సూపర్ స్లిప్ ఎల్‌ఈడీ టీవీ, 2 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీని రూ.7,992కి, టన్ను స్లిట్ ఏసీ మూడు స్టార్ రేటింగ్‌ను రూ.27,990కి బదులు రూ.20,990కి, రెడ్మీ 6ఏ 2జీబీ/16జీబీని రూ.6,299కి, రెడ్మీ వై2 3జీబీ/32 జీబీని రూ.9,299కి, గృహోపకరణాలపై 60 శాతం డిస్కౌంట్‌తోపాటు 20 శాతం అదనపు క్యాష్ బ్యాక్ లభించనున్నది.

3104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles