వీడిన ఉత్కంఠ.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా భూపేష్

Sun,December 16, 2018 02:19 PM

Bhupesh Baghel to be Chief Minister of Chhattisgarh

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్యమంత్రి ఎంపికపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గత ఐదు రోజులుగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ భూపేష్ బాఘెల్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ.

ఛత్తీస్‌గఢ్ నుంచి సీఎం రేసులో ఉన్న టీపీ సింగ్‌ దేవ్‌, తమరాథ్‌వాజ్ సాహు, భూపేష్ బాఘెల్‌ , చరణ్ దాస్ మహంత్‌లతో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ శ‌నివారం స‌మావేశమ‌య్యారు. అనంత‌రం ఆ న‌లుగురితో దిగిన ఫొటోను రాహుల్‌ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles