
న్యూఢిల్లీ: అస్సాం సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భూపేన్ హజారికాకు భారత రత్న అవార్డు ఇవ్వడం అన్నది ఓ చీప్ థ్రిల్ అని ఆయన కుమారుడు విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ.. నిరసనలు భగ్గుమంటున్నాయి. అయితే ఆ ఆందోళనలను అణగదొక్కేందుకే భారత రత్న అవార్డును ఇచ్చారని ఆయన అన్నారు. తన తండ్రి పేరును దుర్వినియోగం చేస్తున్నారని తేజ్ హజారికా అన్నారు. వాస్తవానికి తనకు ఇప్పటి వరకు ఎటువంటి ఆహ్వానం అందలేదని, అందుకే ఆ అవార్డును తిరస్కరించేందుకు కూడా అర్హుడిని కాదన్నారు.