ఎస్పీ, ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా బంద్

Thu,September 6, 2018 09:22 AM

Bharat bandh is called by upper caste groups against amendments in SC/ST Act

పాట్నా : ఎస్పీ, ఎస్టీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఉన్నత కులాలకు చెందిన కొన్ని వర్గాలు ఈ బంద్ పాటిస్తున్నాయి. బీహార్‌లోని అరాలో రైళ్లను నిలిపేశారు. మార్కెట్లను మూసివేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ బంద్ సంపూర్ణంగా జ‌రుగుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. మధ్యప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మోరినా, శివపురి, బింద్‌తో పాటు గ్వాలియర్ చంబల్ ప్రాంతాల్లో ఈ నిషేధం ఉంటుంది.


మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బింద్ జిల్లాలో స్కూళ్ల‌ను మూసివేశారు. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెట్రోల్ పంపుల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించారు. బీహార్‌లోని స‌వ‌ర‌న్ సేన అనే సంస్థ భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ స‌వ‌ర‌న్ సంస్థ ఉన్న‌ది. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ భార‌త్ బంద్‌కు దూరంగా ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మొత్తం 35 జిల్లాల్లో హై అల‌ర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 కంపెనీ భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మోహ‌రించారు. మ‌రో 5 వేల అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఏర్పాటు చేశారు.

2395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles