మహాకాలేశ్వరుడికి భస్మ ఆరతి

Wed,October 18, 2017 10:24 AM

Bhama Aarti performed at Ujjain Mahakaleshwar temple today

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాల ఆలయంలో ఇవాళ విశేష పూజలు నిర్వహించారు. జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరుడికి ఇవాళ భస్మ ఆరతి సమర్పించారు. నరకచతుర్ధశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో జనం మహాకాలేశ్వరుడి దర్శనం కోసం వచ్చారు. ఉదయం నుంచే జనం బారులు తీరారు. పూజారులు శివలింగాన్ని చాలా ఆకర్షణీయంగా అలంకరించారు. జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినీ మూడవది కావడం విశేషం.మహాకాలేశ్వరుడు దక్షిణ అభిముఖం గా వుండటం వల్ల ఈ లింగానికి ‘దక్షిణామూర్తి’ అని కూడా పేరు. ఇక్కడ దేవాలయం మూడు అంతస్తులుగా వుంటుంది. మొదటి అంతస్తులో ‘మహాకాళేశ్వర’ లింగం వుంటుంది. ఈ శివలింగానికి అడుగు భాగం భూమిలోపల దాదాపు 2 మైళ్ళు వుంటుంది అని అంచనా. మహాభారత కాలం లో , ఉజ్జయిని నగరం, ‘అవంతీ దేశపు’ రాజధాని. ఈ ఉజ్జయిని లో మహాకాలేశ్వరుడు, మరియు ‘అష్టాదశ శక్తి పీఠం’ లో ఒకటయిన ‘మహాకాళి’ ఇద్దరు కొలువున్నారు. ఇక్కడ లింగానికి ప్రతిరోజు, ‘క్షిప్ర’నదీ జలాలతో అభిషేకం, ఆ తర్వాత, ‘చితాభస్మం’ తో అలంకరణం జరుగుతుంది.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS