కొత్త వంద నోటుపై ట్విట్టర్‌లో పేలుతున్న జోకులు..!

Fri,July 20, 2018 04:02 PM

Best tweets on lavender 100 Rupee notes

త్వరలో మార్కెట్లోకి కొత్త వంద రూపాయల నోటు రానుంది. సరికొత్త డిజైన్‌తో తళతళలాడుతున్న ఈ నోటును ఊదారంగులో ముద్రించారు. ఈ నోటు ముందుభాగంలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉంది. వెనుకభాగంలో గుజరాత్‌లోని పఠాన్‌లో సరస్వతి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత సాంస్కృతిక వారసత్వ కట్టడం రాణి గారి బావి(రాణి కీ వావ్)ను ముద్రించారు. ఈ భారీ దిగుడు బావిని 11వ శతాబ్దంలో చాళుక్య మొదటి భీముడి స్మారకార్థం వారి వారసులు మరు- గుర్జారా నిర్మాణశైలిలో అత్యద్భుతంగా నిర్మించారు. ఈ బావి చుట్టూ నిర్మించిన కట్టడాలపై చెక్కిన 500 శిల్పాలు నాటి శిల్పకళా వైభవాన్ని కళ్లకు కడతాయి. కొద్ది రోజుల్లోనే కొత్త 100 నోటు మార్కెట్లోకి వస్తుందని భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నోటు కంటే సైజులో ఇది చిన్నగా ఉంటుందని ప్రకటించింది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా కూడా పాత నోట్లు యథావిధిగా అమల్లో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.ఇంతవరకు బాగానే ఉంది కాని కొత్త వంద నోటుపై సోషల్ మీడియా తనదైన శైలిలో స్పందిస్తున్నది. నిజానికి డబ్బు కలర్ అంటే గ్రీన్. అవునా? కాదు.. ఎందుకంటే.. ఇప్పుడు ఇండియన్ కరెన్సీ నోట్లలో రెయిన్‌బోలో ఉన్న కలర్లన్నీ ఉన్నాయి. అందుకే నెటిజన్లు కరెన్సీ కలర్లపై ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. కొత్తగా వచ్చే 100 నోటు ఊదారంగులో ఉండనుంది. ఇదివరకు వచ్చిన రెండు వేల నోటు ఊదా ఎరుపు రంగు(మెజెంటా)లో ఉండగా.. 500 నోటు బూడిద వర్ణంలో ఉంటుంది. ఇక.. రీసెంట్‌గా చెలామణిలోకి వచ్చిన 200 నోటు థిక్ ఎల్లో కలర్‌లో ఉండగా.. 50 నోటు ఫ్లోరోసెంట్ బ్లూ కలర్, 10 నోటు చాకోలేట్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అంటే రెయిన్‌బోలో ఉండే కలర్లన్నింటినీ ఇండియన్ కరెన్సీలో ఉపయోగించారని నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అందులో నుంచి కొన్ని బెస్ట్ ట్వీట్ మీకోసం...6135
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles