టిక్ టాక్ వీడియో చేయబోయి ప్రాణాల మీదకు..వీడియో

Tue,June 18, 2019 07:49 PM

Bengaluru youth injured while shootING tiktok vedio


బెంగళూరు: ఇటీవల కాలంలో టిక్ టాక్ వీడియోల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వినోదం కోసం చేసే టిక్ టాక్ వీడియోలు కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ యువకుడు టిక్ టాక్ వీడియో కోసం రిస్కీ ఫీట్ చేసి..తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తుమకూరుకు చెందిన కుమార్ గాల్లోకి ఎగిరి తలకిందులుగా జంప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఫీట్ కాస్తా రివర్స్ అవడంతో మెడతోపాటు వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

1459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles