హెల్మెట్ పెట్టుకోలేదని బైకర్‌పై షూ విసిరిన పోలీస్.. వీడియో

Mon,April 30, 2018 05:57 PM

Bengaluru Cop Throws Shoe At Bikers For Not Wearing Helmet

బెంగళూరు: ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు. తన తొందరపాటు, కోపానికి సస్పెండై ఇంట్లో కూర్చున్నాడు. బైకర్స్‌పై చూపించిన తన ప్రతాపానికి ఇప్పుడు పశ్చాతాపపడుతున్నాడు. అసలేంజరిగిందంటే.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో బైక్‌ను నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్న ఆ బైక్‌ను గమనించిన ట్రాఫిక్ పోలీస్ తన షూను తీసి వాళ్ల మీదికి విసిరేశాడు. అయితే.. ఈ ఘటన యాక్సిడెంటల్‌గా రికార్డయింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో ఆ ట్రాఫిక్ పోలీసు సస్పెండ్ కావాల్సి వచ్చింది.

అసలు వీడియో ఎలా రికార్డయిందంటే..


బెంగళూరుకు చెందిన యూట్యూబర్ రిషాబ్ చటర్జీ బెంగళూరు రోడ్ల మీద ఓ వీడియోను చిత్రీకరిస్తున్నాడట. అందులో భాగంగానే తన కారు లోపల కెమెరాను అమర్చి కారును డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అయితే.. అకస్మాత్తుగా ట్రాఫిక్ పోలీసు బైకర్‌పై షూ విసిరిన ఘటన కూడా రికార్డయింది. దీంతో ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరలవడం.. నెటిజన్లు ఆ పోలీసుపై ఫైర్ అవడంతో.. విషయం ట్రాఫిక పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలిసింది. దీంతో మనోడిని సస్పెండ్ చేసి ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

గత ఫిబ్రవరి 20న బెల్ రోడ్‌లో ఈ ఘటన జరగగా.. గత బుధవారమే ఆ వీడియోను చటర్జీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. వీడియో దాదాపు 8 నిమిషాలు ఉంటుంది. డైరెక్ట్ గా పోలీస్ ద‌గ్గ‌రికి వెళ్లాలంటే 6 నిమిషాల 50 సెకండ్ల ద‌గ్గ‌ర క్లిక్ చేయండి.

6159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles