స్కూల్ విద్యార్థికి సెల్యూట్ చేసి హీరో అయ్యాడు.. వీడియో

Mon,March 12, 2018 04:11 PM

Bengaluru City police Commissioner salutes school boy video goes viral

గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే.. నువ్వు వేరే వాళ్లకు మర్యాద ఇస్తేనే వాళ్లు కూడా నీకు మర్యాద ఇస్తారు. అంతే కదా దాని అర్థం. సూపర్. అదే సూక్తిని ఫాలో అవుతున్నట్టున్నాడు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్. ఓ స్కూల్ విద్యార్థికి సెల్యూట్ చేసి ఇప్పుడు హీరో అయ్యాడు. ఆయన పోలీస్ అయ్యాక ఎన్ని మంచి పనులు చేసి ప్రజల మనుసులు దోచుకున్నాడో తెలియదు కాని ఈ ఒక్క సెల్యూట్‌తో మాత్రం సోషల్ మీడియా హీరో అయిపోయాడు. నెటిజన్లు అయితే.. ఆయనపై కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ పోలీస్ బాస్ ఓ పిల్లాడికి సెల్యూట్ ఎందుకు చేశాడనేగా మీ డౌట్.

ఓ పిల్లాడు స్కూల్‌కు వెళ్తుండగా సడెన్‌గా మనోడికి పోలీస్ బాస్ కనిపించాడు. అంతే.. వెంటనే చేయి లేచింది. పోలీస్ బాస్‌కు సెల్యూట్ చేశాడు. వెంటనే పోలీస్ బాస్ కూడా ఆపిల్లాడికి సెల్యూట్ చేశాడు. అంతే. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతున్నది. అది అసలు విషయం.

5301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS