ఒక్క రోజులోనే ఇల్లు కట్టాడు..వీడియో

Tue,July 17, 2018 10:28 PM

Bengaluru architect build insta home in one day


నెలల తరబడి ఎదురుచూసి, సమయం వృథా చేయకుండా ఒక్కరోజులోనే ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుండు! ఐడియా భలే ఉంది అనిపిస్తుంది కదా! ఈ ఐడియాను నిజంచేశాడు బెంగళూరు ఆర్కిటెక్ట్. ఇదిగో మీరే చదువండి.

160 గజాల స్థలంలో అన్ని వసతులతో కేవలం ఒక్కరోజులోనే ఇల్లు కట్టి చూపించాడు ఓ ఆర్కిటెక్ట్. ఆ ఇంట్లో కిచెన్, బెడ్‌రూమ్, డైనింగ్ హాల్, లివింంగ్ రూమ్, బాత్‌రూమ్, స్టోర్ రూమ్ ఇలా అన్నీ అమర్చాడు. ఈ అద్భుతాన్ని సాధించిన వ్యక్తి పేరు అన్శూల్ చోడ. బెంగళూరుకు చెందిన ఈ యువ ఆర్కిటెక్ట్ నిర్మాణ రంగంలో మంచి పేరున్న వ్యక్తి. ఎన్నో అవార్డులు సైతం గెలుచుకున్నాడు. ఇంతకీ అన్శూల్‌కి ఈ ఐడియా ఎలా వచ్చిందంటే.. తన ఆఫీస్ కోసం ఒక వ్యక్తి దగ్గర స్థలం లీజుకు తీసుకున్నాడు అన్శూల్. ఆ స్థలానికి సంబంధించి అప్పుడప్పుడు వివాదాలు చుట్టుముట్టడంతో పరిష్కారం కోసం ఆలోచించాడు.

ఈ క్రమంలోనే ఓ ఐడియా వచ్చింది. ఒక్కరోజులోనే కట్టి, వద్దనుకుంటే వేరే చోటికి తీసుకెళ్లేలా ఇల్లు కట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 3-4 వారాల పాటు అధ్యయనం చేశాడు. చెక్కతో ఓ ఇల్లు రూపొందించాడు. 160 గజాల విస్తీర్ణంలో ఉండడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో ఆ ఇల్లు రూపొందించాడు. దానికి జెన్-డెన్ అని పేరు పెట్టాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే వీలున్న ఈ ఇల్లుకు మెల్లమెల్లగా డిమాండ్ పెరుగుతున్నది. బిర్చ్‌వుడ్‌తో చేసే ఈ వుడెన్ జెన్ - డెన్ నిర్మాణం కూడా తక్కువ ఖర్చులో అయిపోతున్నది. పైగా పర్యావరణానికి ఎలాంటి కీడు కలుగదు.

4731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS