దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన

Fri,June 14, 2019 11:34 AM

Bengal Doctors Protest Spreads and Health Services Hit In Delhi hyderabad Mumbai

హైదరాబాద్‌ : కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం ఓ రోగి మృతి చెందడంతో.. ఆ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని బెంగాల్‌ జూడాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్‌ జూడాలకు మద్దతుగా దేశ వ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు, హైదరాబాద్‌లోని నిమ్స్‌ డాక్టర్లు, మహారాష్ట్రలోని రెసిడెంట్‌ డాక్టర్స్‌, ఛత్తీస్‌గఢ్‌లో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వైద్యులపై దాడులు జరుగుతున్నాయని, దాడులను నియంత్రించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. డాక్టర్లు తమ తలకు హెల్మెట్లు ధరించి, బ్యాండెజ్‌లు వేసుకుని నిరసన చేపట్టారు. నలుపు రంగు రిబ్బన్‌ కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు జూనియర్‌ డాక్టర్లు. వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles