హెచ్చరికలు బేఖాతరు..కశ్మీర్ లోయకు బెల్జియం కపుల్

Fri,September 13, 2019 06:52 PM

జమ్మూకశ్మీర్: డి సామ్, నలియా బెల్జియంకు చెందిన కపుల్. చాలా రోజుల నుంచి జమ్మూకశ్మీర్ ట్రిప్ వేయాలని ప్లాన్ వేసుకున్నారు. ప్రఖ్యాత హర్ముఖ్ పర్వత వ్యాలీని అధిరోహించాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్, లఢఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లొద్దని పలువురు దౌత్యవేత్తలు, స్థానికులు సామ్, నలియాను హెచ్చరించారు. అయితే వాళ్లిద్దరూ ఎవరి హెచ్చరికలను లెక్కచేయలేదు. కైలాశ్ ఆఫ్ కశ్మీర్‌గా పేరొందిన 15000 అడుగుల ఎత్తైన హర్ముక్ లేక్ వ్యాలీని సామ్, నలియా విజయవంతంగా అధిరోహించారు. దక్షిణ కశ్మీర్‌లోని గండెర్బాల్ జిల్లాలో అత్యంత ఎత్తులో ఉన్న హర్ముఖ్-గంగ్‌బల్ లేక్ వ్యాలీని సందర్శించాలనుకున్నాం. క్షేత్రస్థాయిలో మార్పులు ఉన్నప్పటికీ మేం ఇక్కడికొచ్చాం.

హర్ముఖ్ హిల్స్‌లోని అల్పైన్ అడవులు, అందమైన ఆకుపచ్చ పచ్చికబయళ్లు, క్రిస్టల్ నీటితో కూడిన సరస్సులు చూశామని డి సామ్ పేర్కొన్నాడు. హర్ముఖ్ శిఖరం నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూడటం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని నలియా చెప్పింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు హోంశాఖ యాత్రికులందరినీ కశ్మీర్ విడిచివెళ్లిపోవాలని సూచనలు జారీచేసింది.


ఈ నేపథ్యంలో వివిధ దేశాల దౌత్యవేత్తలు కూడా జమ్మూకశ్మీర్ సందర్శనకు వెళ్లకూడదని వారి పౌరులకు హెచ్చరికలు జారీచేశారు. మేం ఎవరి హెచ్చరికలను పట్టించుకోలేదు. కొంతమంది సంచారజాతీయుల సాయంతో మేమిక్కడికి వచ్చాం. ఇక్కడ ఎలాంటి భయం లేదు. సంచారజాతి వ్యక్తులు మాకు ఉండటానికి స్థలం చూపించారు. వాళ్లు మాకు చాలా సహకరించారు. ఉగ్రవాదుల ఛాయలు ఏం కనిపించలేదు. అందమైన,సహజసిద్ధమైన, ఆధ్యాత్మికతను, శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రకృతి అందాలను ఆస్వాదించామని డి సామ్ చెపుకొచ్చాడు.

4221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles