అడుక్కోవడం నేరం కాదు!

Wed,August 8, 2018 06:13 PM

Begging Decriminalised by Delhi High Court

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అడుక్కోవడం నేరం కాదంటూ అక్కడి హైకోర్టు తీర్పు చెప్పింది. భిక్షాటన చేయడం నేరమని చెబుతూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, అవి కొట్టేయదగినవే అని కోర్టు స్పష్టంచేసింది. ఈ అంశంలో సామాజిక, ఆర్థిక కోణాలను క్షుణ్నంగా పరిశీలించి, బలవంతపు భిక్షాటనను అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావచ్చని హైకోర్టు తన తీర్పులో తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అడుక్కోవడం నేరమని, అలాంటి వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. కనీస అవసరాలైన ఆహారం, ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్న దేశంలో భిక్షాటన ఎలా నేరం అవుతుందని గతంలోనే ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అడుక్కోవడం నేరం కాదంటూ దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.

2594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS