కొండ ఎక్కుతున్న ఎలుగుపై రాళ్లతో దాడి.. నీళ్లలో పడిపోయిన మూగజీవి: వీడియో

Sat,May 11, 2019 04:10 PM

Bear Tumbles Off Cliff After Stones Thrown At It In Kargil

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోని డ్రాస్‌లో ఎలుగుబంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కొండ ఎక్కుతున్న ఎలుగుపై పైనుంచి రాళ్లు విసిరేశారు. దీంతో పట్టుకోల్పోయిన గోధుమరంగు ఎలుగుబంటి నదిలో పడిపోయింది. కొండకు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు ఎలుగును తరుమడంతో అటుగా వచ్చిన ఎలుగు వారి నుంచి రక్షించుకునేందుకు కొండ ఎక్కేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన వ్యక్తులు పై నుంచి రాళ్లతో దాడి చేశారు. అది పట్టుతప్పి నీళ్లలో పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. జమ్ము మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అమానవీయ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎలుగు ఆచూకీ కోసం రాష్ట్ర అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి బషీర్ హుల్‌హక్ చౌదరీ తెలిపారు.5871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles