గొప్ప ప్రేమికుడిగా ఉండు.. ప్రేమ వివాహం కేసులో సుప్రీం

Wed,September 11, 2019 04:17 PM

Be A Great Lover Supreme Court To Muslim Man Who Married Hindu Woman

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మతాంతర వివాహం కేసు సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది. హిందూ మహిళ ముస్లిం వ్యక్తి వివాహమాడింది. మహిళ కుటుంబ సభ్యుల చేత ఆమోదం పొందేందుకు వ్యక్తి హిందూ మతాన్ని స్వీకరించాడు. అయినా మహిళ కుటుంబ సమ్మతి తెలపకపోవడంతో వివాదం కేసుగా పరిణమించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ.. కులాంతర వివాహాలకు, మతాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. అమ్మాయి భవిష్యత్‌నే తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు. కావునా సదరు వ్యక్తి గొప్ప ప్రేమికుడిగా, నమ్మకస్థుడైన భర్తగా ఉండాలని కోర్టు పేర్కొంది. అమ్మాయిలకు పెండ్లి పేరుతో వల వేస్తున్నరన్న యువతి తండ్రి ఆరోపణల నేపథ్యంలో ధర్మాసనం సదరు వ్యక్తి వివరాలను ఆరా తీసింది. ఆర్య సమాజ్‌లో పెండ్లి అనంతరం, చట్టపరంగా వ్యక్తి తన పేరును మార్చుకున్నడా? లేదా అని ధర్మాసనం పరిశీలించింది. యువతి ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వోన్నత స్యాయస్థానం ఆదేశించింది.

2211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles